ఋగ్వేద సంధ్యావందనం
ఓం శ్రీ మహాగణాధిపతియే నమః -శ్రీ మహా సరస్వత్త్యై నమః
శ్రీ గురుభ్యో నమః
కావలసిన పాత్రలు
1.చెంబు
2.పూల పళ్ళెం
3.పంచ పాత్రలు రెండు
4.ఉద్దరిణెలు
5.జలము విడుచుటకు పళ్ళెము
6.ధర్భాసనం
విషయాను క్రమణిక
1. శరీర శుద్ధి
2. ఆచమనము
3. భూతోచ్చాటనము
4. ఆసన సంస్కారము
5. ప్రాణాయామము
6. సంకల్పము
7. మార్జనము
8. మంత్రాచమనము
9. పునర్మార్జనము
10. పాపపురుష విమోచనము
11. ఆచమనము
12. ప్రాణాయామము
13. ఆర్ఘ్యప్రధానము
14. ఆత్మప్రదక్షిణము
15. తర్పణము
16. గాయత్రి ఆవాహనము
17. గాయత్రి జప సంకల్పము
18. ముద్రా ప్రదర్శనము
19. గాయత్రీ ధ్యానం
20. గాయత్రి మంత్రజపము
21. ఉత్తరముద్రలు
22. సూర్యోపస్థానము
23. దిగ్దేవతా నమస్కారము
24. ఋషి దేవతాది నమస్కారము
25. దేవతా స్మరణము
26. గాయత్రి ప్రస్థాన ప్రార్థన
27. నారాయణ నమస్కృతి
28. భూమ్యాకాశాభి వందనం
29. అభివాదనమ్
30. సమర్పణము
1.శరీర శుద్ధి
మంత్రము :
ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో౽పివా !
య: స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా భ్యంతరశ్శుచి:!!!
పుండరీకాక్ష ! పుండరీకాక్ష!! పుండరీకాక్షాయ నమ: !!!
(అని 3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను)
2.ఆచమనం
ఆచమ్య
1.
ఓం కేశవాయ స్వాహా ఈ విధముగా అంటూ ఉద్ధరిణితో కుడిచేతిలోకి
2.
ఓం నారాయణాయ స్వాహా నీటిని
తీసుకొని
3.
ఓం మాధవాయ స్వాహా మూడుసార్లు త్రాగాలి
4.
ఓం గోవిందాయ నమ: నీటిని వదిలి నమస్కరిస్తూ
5.
ఓం విష్ణవే నమ: అని అరచేతులు కడుగుకొనవలెను
6.
ఓం మధుసూదనాయ నమ: అని అంగుష్ఠ ముతో పై పెదవిని
7.
ఓం త్రి విక్రమాయ నమ: తర్వాత క్రింద పెదవిని తుడుచుకోనవలెను
8.
ఓం వామనాయ నమ: అని శిరమున రెండు మారులు
9.
ఓం శ్రీధరాయ నమ: నీళ్ళు చల్లుకోనవలెను
10.
ఓం హృషీకేశాయ నమ: అని ఎడమచేతి ఫై నీరు చల్లుకోనవలెను
11.
ఓం పద్మనాభాయ నమ: అని పాదముల మీద నీరు చల్లుకోనవలెను
12.
ఓం దామోదరాయ నమ: అని శిరస్సు పై
నీరు చల్లుకోనవలెను
13.
ఓం సంకర్షణాయ నమ: అని చేతివ్రేళ్ళను గిన్నె వలె చేసి గడ్డమును స్పృశిం
చవలెను
14.
ఓం వాసుదేవాయ నమ: అని అంగుష్ఠ - తర్జనులతో
15.
ఓం ప్రద్యు మ్నాయ నమ: ముక్కు రంధ్ర ములను తాకవలెను
16.
ఓం అనిరుద్ధాయ నమ: అని అంగుష్ఠ - అనమికలతో
17.
ఓం పురుషోత్తమాయ నమ: నేత్రములను తాకవలెను
18.
ఓం అధోక్షజాయ నమ: అని అంగుష్ఠ - అనామికలతో
19.
ఓం నారసింహాయ నమ: చెవులను తాకవలెను
20.
ఓం అచ్యుతాయ నమ: అని అంగుష్ఠ - కనిష్ఠ కలతో నాభిని తాకవలెను
21.
ఓం జనార్ధనాయ నమ: అని అరచేతితో వక్షః స్థలములను తాకవలెను
22.
ఓం ఉపేంద్రాయ నమ: అని కరాగ్రముతో శిరమును తాకవలెను
23.
ఓం హరయే నమ: అని ముకుళిత హస్తముతో కుడి ,
24.
ఓం శ్రీ కృష్ణాయ నమ: ఎడమ బాహుములను (భుజము ) లను
తాకవలెను
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీ మన్నారాయునణునితో సమానుడగును
3. భూతోచ్చాటనము
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః యే తే భూమిభారకాః !
ఏతేషామవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే !!
4. ఆసన సంస్కారము
ఓమ్ పృథివ్యాః ! మేరుపృష్ట ఋషిః ! కూర్మోదేవతా !
సుతలం ఛంధః ! ఆసనే వినియోగః !! అనంతాసనాయ నమః !!
5.ప్రాణాయామం
సూచిక : దీనిని గురువు సమక్షంలో అభ్యాసము చేయవలెను
ప్రణవస్య పరబ్రహ్మఋషిః ! పరమాత్మా దేవతా ! దైవీ గాయత్రీ ఛంధః ! ప్రాణాయామే వినియోగః !!
(ముక్కు పట్టుకొని ఎడమరంధ్రంతో ఈ క్రింది మంత్రమును జపిస్తు గాలిని మెల్లగా పీల్చి
ఓం భూః ! ఓం భువః ! ఓం స్వః ! ఓం మహః ! ఓం జనః ! ఓం తపః ! ఓం సత్యమ్
బంధించి ఈ క్రింది మంత్రమును జపించి
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !
మెల్లగా కుడిరంధ్రం నుండి ఈ క్రింది మంత్రమును తో విడిచిపెట్టాలి)
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్ !!
6.దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పం
శుభే శోభనే ముహూర్తే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో:దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య [ఆగ్నేయ] ప్రదేశే శ్రీకృష్ణా గోదావర్యోర్ మధ్య ప్రదేశే ......... నివాస( గ్రుహే) సమస్త దేవత గో బ్రాహ్మణా హరిహరణ గురుచరణ సన్నీధౌ !
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ....... నామ సంవత్సరే ........ అయనే, .......... .ఋతౌ ............మాసే, శుక్ల/కృష్ణ పక్షే ........ తిథౌ ........... వాసరశుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవం గుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ !
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్....గోత్రః.....నామధేయోహం (వివాహమైనవారు "ధర్మపత్నీ సమేతోహం" అని చెప్పుకోవాలి) ప్రాతః (మాధ్యాహ్నిక, సాయం ) సంధ్యా ముపాసిష్యే !!
7.మార్జనం
ఆపోహిష్టేతి తృచస్యాంబరీషః సింధుద్వీప ఋషిః ! ఆపోదేవతా ! గాయత్రీ ఛందః ! మార్జనే వినియోగః !!
(నీళ్లు శిరస్సు ఫై జల్లుకుంటూ క్రింది మంత్రాన్ని జపించాలి)
ఓం ఆపో హి ష్టా మయోభువః ! తాన ఊర్జే దధాతన ! మహేరణాయ చక్షసే !
యో వ శ్శివతమో రసః ! తస్య భాజయతే హ నః ! ఉశతీరివ మాతరః !
తస్మా అరం గమామ వః ! యస్య క్షయాయ జిన్వథ ! ఆపో జనయథా చ నః !
8. మంత్రాచమనము
ప్రాతః కాల మంత్రాచమనము
(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)
సూర్యశ్చేత్యస్య మంత్రస్య ! యాజ్ఞవల్క్యోపనిషద్ ఋషిః ! (నారాయణ ఋషిః) !
సూర్యమన్యు మన్యుపతి రాత్రయో దేవతాః ! ప్రకృ తిశ్చందః ! మంత్రాచమనే వినియోగః !!
ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః ! పాపేభ్యో రక్షన్తామ్ ! యద్రాత్రియా పాపమకార్షమ్ !
మనసా వాచా హస్తాభ్యామ్ ! పద్భ్యా ముదరేణ శిశ్నా! రాత్రిస్తదవలుమ్పతు ! యత్కించ దురితం మయి !
ఇదమహం మా మమృత యోనౌ ! సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా !! (అని చెప్పినీళ్లు త్రాగాలి)
!! ఆచమ్య కృత్వా !!
మాధ్యా హ్నిక మంత్రాచమనము
ఆపః పునంత్విత్యస్య మంత్రస్య ! పూత ఋషిః ! ఆపోదేవతా ! అష్టీ ఛంద: ! అపాం ప్రాశనే వినియోగః !!
ఓమ్ ఆపః పునన్తు పృధివీం పృథివీ పూతా పునాతు మామ్ ! పునన్తు బ్రహ్నస్పతిర్బ్రహ్మ పూత పునాతు మామ్ ! యదుచ్చిష్టం మభోజ్యం యద్వా దుశ్చరితం మమ ! సర్వం పునన్తు మా మాపో౽సతాం చ ప్రతిగ్రహం స్వాహా !!
(అని చెప్పినీళ్లు త్రాగాలి)
!! ఆచమ్య కృత్వా !!
సాయంకాల మంత్రాచమనము
అగ్నిశ్చేత్యస్య మంత్రస్య ! యాజ్ఞవల్క్యోపనిషద్ ఋషిః ! అగ్నిమన్యు మన్యుపత్యహాని దేవతాః ! ప్రకృతిశ్చందః ! మంత్రాచమనే వినియోగః !!
ఓం అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః ! పాపేభ్యో రక్షంతామ్ ! యదాహ్న పాపమకార్షమ్ ! మనసా వాచా హస్తాభ్యామ్ ! పద్భ్యా ముదరేణ శిశ్నా! అహస్తదవలుమ్పతు ! యత్కించ దురితం మయి ! ఇదమహం మామమృత యోనౌ ! సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా !! (అని చెప్పినీళ్లు త్రాగాలి)
!! ఆచమ్య కృత్వా !!
9.పునర్మార్జనం
ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్య ! సింధుద్వీపో అంబరీషో వా ఋషిః ! ఆపో దేవతా ! గాయత్రీ ఛంధః ! ద్వ్యనుష్టుబంతం ! పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్టా ! అంతే ద్వే అనుష్టుభౌ ! పునర్మార్జనే వినియోగః !!
(మరల శిరస్సు పై నీళ్లు జల్లుకుంటూ ఈ క్రింది మంత్రం జపించాలి)
ఓమ్ ఆపో హి ష్టా మయోభువః ! తా న ఊర్జే దధాతన ! మహేరణాయ చక్షసే !
యోవ శ్శివతమో రసః ! తస్య భాజయతే హ నః ! ఉశతీరివ మాతరః !
తస్మా అరంగమామ వః ! యస్య క్షయాయ జిన్వథ ! ఆపో జనయథా చ నః !!
(ఈ క్రింది శిరస్సు మంత్రంముతో కూడా నీళ్లు జల్లుకుంటూ జపించాలి)
ఓం శన్నో దేవీ రభీష్టయ ఆపో భవంతు పీత యే !! శంయోరభిస్రవంతునః !
ఈశానా వార్యాణామ్ క్షయంతీశ్చ ర్షణీనామ్ ! ఆపోయాచామి భేషజమ్ !
అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా ! అగ్నిం చ విశ్వ శంభువమ్ !
ఆపః పృణీత భేషజమ్ వరూథం తన్వే మమఁ ! జ్యోక్చ సూర్యం దృశే !
ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి ! యద్వాహ మభిదుద్రోహ యద్వా శేప ఉతానృతమ్ !
ఆపో అద్యాన్వచా రిషమ్ రసేన సమగస్మహి ! పయస్వానగ్న ఆగహి !
తం మా సంసృజ వర్చసా ! సస్రషీ స్తదపసో దివానక్తం చ సస్రుషీః !
వరేణ్య క్రతూరహమాదేవీ రవసేహువే ! ఆపోమాం రక్షంతు!
10. పాప పురుష విమోచనము
ఓం ఋతంచ సత్యంచేత్యస్య సూక్తస్య ! అఘమర్షణ ఋషిః ! భావవృత్తో దేవతా !
అనుష్టుప్ ఛంధః ! మమ పాప పురుష జల విసర్జనే వినియోగః !!
(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)
ఓం ఋతం చ సత్యమ్ చాభీద్ధాత్తపసో౽ధ్యజాయత ! తతో రాత్ర్య జాయత !
తత స్సముద్రో అర్ణవః ! సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత !
అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ ! సూర్యాచం ద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ !
దివిం చ పృథివీం చాన్తరిక్ష మథొ స్వః ! (నీటిని వీడిచి పెట్టాలి)
11. ఆచమనం (పునః)
!! ఆచమ్య కృత్వా !!
ఓం కేశవాయ స్వాహా....ఓం కృష్ణాయ నమః
12. ప్రాణాయామం (పునః)
సూచిక : దీనిని గురువు సమక్షంలో అభ్యాసము చేయవలెను
ప్రణవస్య పరబ్రహ్మఋషిః ! పరమాత్మా దేవతా ! దైవీ గాయత్రీ ఛంధః ! ప్రాణాయామే వినియోగః !!
(ముక్కు పట్టుకొని ఎడమరంధ్రంతో ఈ క్రింది మంత్రమును జపిస్తు గాలిని మెల్లగా పీల్చి
ఓం భూః ! ఓం భువః ! ఓం స్వః ! ఓం మహః ! ఓం జనః ! ఓం తపః ! ఓం సత్యమ్
గాలిని బంధించి ఈ క్రింది మంత్రమును జపించి
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !
మెల్లగా కుడిరంధ్రం నుండి ఈ క్రింది మంత్రమును తో విడిచిపెట్టాలి)
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్ !!
13.అర్ఘ్య ప్రదానం
ప్రాతః అర్ఘ్య ప్రదానమ్
పుర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వ ప్రీత్యర్థం ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యే !!
ఓం తత్సవితురిత్యస్య మంత్రస్య ! గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా ! గాయత్రీ ఛంధః ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః!
ఓం భూర్భువః స్వః ఓం తత్స వితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
(అని పై మంత్రమును పటించుచు మూడు సార్లు అర్ఘ్యము నీయవలెను)
ప్రాతః కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం
ప్రాతః సంధ్యాంగ ముఖ్యకాలాతిక్రమణ దోష
పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం కరిష్యే
యదద్యకచ్చేత్యస్య మంత్రస్య కుత్సఋషిః సవితాదేవతా
గాయత్రీ ఛంధః ప్రాతః సంధ్యాంగ ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః
యదద్య కచ్చ వృత్రహన్నుదగా అభిసూర్య సర్వం తదింద్ర తే వశే
(అని ప్రాయశ్చిత్తార్ఘ్యమును ఈయవలెను )
మాధ్యాహ్నిక అర్ఘ్య ప్రదానమ్
పుర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వ ప్రీత్యర్థం మాధ్యాహ్నిక సంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యే !!
హంసశ్సుచిషదిత్యస్య మంత్రస్య ! గౌతమపుత్రో వామదేవ ఋషిః సూర్యో దేవతా ! జగతీ ఛంధః మాధ్యాహ్నిక సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః
ఓం హంస శ్సుచిషద్వ సురన్తరిక్ష్ సద్దో తావేదిష దతిథి ర్దురోణ సత్
నృష ద్వరసదృత సద్వ్యోమ సదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్
(ఇతి ప్రథమార్ఘ్యమ్ )
ఆకృష్ణే నేత్యస్య మంత్రస్య ! హీరణ్య స్తూప ఋషిః సవితా దేవతా ! త్రిష్టుప్ ఛంధః మాధ్యాహ్నిక సంధ్యాంగ ద్వితీయా ర్ఘ్య ప్రదానే వినియోగః
ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశ యన్న మృతం మర్త్యం చ
హీరణ్య యేన సవితా రథే నా౽౽దేవోయాతి భువనాని పశ్యన్
(ఇతి ద్వితీయార్ఘ్యమ్ )
ఓం తత్సవితురిత్యస్య మంత్రస్య ! గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా ! గాయత్రీ ఛంధః మాధ్యా హ్నిక సంధ్యాంగ తృతీయార్ఘ్య ప్రదానే వినియోగః!
ఓం భూర్భువః స్వః ఓం తత్స వితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
(ఇతి తృతీయార్ఘ్యమ్ )
మాధ్యాహ్నిక కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం
మాధ్యాహ్నిక సంధ్యాంగ ముఖ్యకాలాతిక్రమణ దోష
పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం కరిష్యే
ప్రాతర్దేవీత్యస్య మంత్రస్య అభితప ఋషిః సూర్యో దేవతా
త్రిష్టుప్ ఛంధః మాధ్యాహ్నిక సంధ్యాంగప్రాయశ్చిత్తార్ఘ్యప్రదానే వినియోగః
ప్రాతర్దేవీమదితిం జొహవీమీ మధ్యందిన ఉదితా సూర్యస్య రాయేమిత్రా
వరుణా సర్వతాతేళే తోకాయ తనయాయ శం యోః
(అని ప్రాయశ్చిత్తార్ఘ్య మును ఈయవలెను)
సాయంకాల అర్ఘ్య ప్రదానమ్
పుర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వ ప్రీత్యర్థం సాయం సంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యే !!
ఓం తత్స వితురిత్యస్య మంత్రస్య గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా ! గాయత్రీ ఛంధః సాయం సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః
ఓం భూర్భువః స్వ: తత్స వితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ! ధియో యో న: ప్రచోయాత్||
సాయం కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం
సాయం సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ దోష
పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం కరిష్యే
ఉద్ఘేదభీత్యస్య మంత్రస్య కుత్సఋషిః సవితాదేవతా
గాయత్రీ ఛంధః సాయం సంధ్యాంగ ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః
ఉద్ఘేదభిశ్రుతా మఘం వృషభం నర్యాపసమ్ ! అస్తార మేషి సూర్య!
(అని ప్రాయశ్చిత్తార్ఘ్యమును ఈయవలెను )
14. ఆత్మప్రదక్షిణము
బ్రహ్మైవ సత్యం బ్రహ్మైవాహమ్ యోసావాదిత్యో హిరణ్మయః పురుష స్స్ ఏవాహమస్మి
అసావాదిత్యో బ్రహ్మా !!
(ఈ ఆదిత్యుడే పరబ్రహ్మము - అని ధ్యానింపవలెను ఉదకమును ప్రదక్షిణముగా శిరస్సు చుట్టూ త్రిప్పుతూ వదిలి పెట్టవలెను)
!! ఆచమ్య కృత్వా !! ప్రాణాయామ త్రయం కృత్వా !!
15. తర్పణము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః (మాధ్యాహ్నిక, సాయం ) సంధ్యాంగ తర్పణం కరిష్యే !!
ప్రాతః కాలమునందు
1.
సంధ్యాం తర్పయామి
2.
గాయత్రీం తర్పయామి
3.
బ్రాహ్మీం తర్పయామి
4.
నిమృజీం తర్పయామి
మాధ్యా హ్నికమునందు
1.
సంధ్యాం తర్పయామి
2.
సావిత్రీం తర్పయామి
3.
రౌద్రీమ్ తర్పయామి
4.
నిమృజీం తర్పయామి
సాయం కాలమునందు
1.
సంధ్యాం తర్పయామి
2.
సరస్వతీం తర్పయామి
3.
వైష్ణవీం తర్పయామి
4.
నిమృజీం తర్పయామి
16. గాయత్రి ఆవాహనము
ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ ! అగ్నిర్దేవతా ! బ్రహ్మ ఇత్యార్షమ్ ! గాయత్రం ఛందం ! పరమాత్మం సరూపమ్ ! సాయుజ్యం వినియోగం ! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మితమ్ ! గాయత్రీం ఛందసాం మా తేదం బ్రహ్మ జుషస్వమే ! యదాహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతి ముచ్యతే ! యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతి ముచ్యతే ! సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతీ
ఓజో౽సి సహో౽సి బలమసి భ్రాజో౽సి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు: అభిభూరోం
గాయత్రీ మావాహయామి ! సావిత్రీ మావాహయామి ! సరస్వతీ మావాహయామి ! ఛందర్షీ నావాహయామి ! శ్రియ మావాహయామి ! బలమావాహయామి! గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి: ! సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయం రుద్ర రుద్రశ్శిఖా పృథివీ యోని: ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షర త్రిపదా షట్కుక్షి: పంచశీర్షోపనయనే వినియోగ: ఓం భూ: ! ఓం భువ: ! ఓం స్వ: ! ఓం మహ: ! ఓం జన: ! ఓం తప: ! ఓం సత్యం ! ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న: ప్రచోదయాత్ ! ఓమాపోజ్యోతి రసో౽మృతం బ్రహ్మ భూర్భువస్స్వరోం!
17.గాయత్రి జప సంకల్పము
!! ఆచమ్య కృత్వా !! ప్రాణాయామ త్రయం కృత్వా !!
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వ ప్రీత్యర్థం ప్రాతః (మాధ్యాహ్నిక, సాయం) స్సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్ర జపం కరిష్యే
కరన్యాసం
(రెండు చేతులతో చేయాలి - వేలిని స్పృశించాలి)
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ:
వరేణ్యమ్ విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:
భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ:
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ:
ధియో యో న: జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ:
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమ:
అంగన్యాసం
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ:
వరేణ్యమ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా
భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే కవచాయహుం
ధియో యో న: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్
భూర్భువస్వరోమితి దిగ్భంధ:
ధ్యానం
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే!
యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!!
18.ముద్రా ప్రదర్శనము
1.సుముఖం
2.సంపుటం (చైవ )
3.వితతం
4.విస్థ్రుతం (థథ )
5.ద్విముఖం
6.త్రిముఖం (చైవ)
7.ఛతుర్ముఖం
8.పంచముఖం (థథ)
9.షణ్ముఖం
10.అధో ముఖం (చైవ )
11. వ్యాపకాంజలికం (థథ)
12.శకటం
13.యమపాషం (చ )
14.గ్రధితం
15.సమ్ముఖోన్ముఖం
16.ప్రలంబం
17.ముష్టికం
18.మత్స్య :
19.కూర్మ :
20.వరాహకం
21.సింహాక్రాంతం
22.మహక్రాంతం
23.ముద్గరం
24.పల్లవం (తథ)
19.గాయత్రీ ధ్యానం
ధ్యానం
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే!
యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!!
20.గాయత్రి మంత్రజపము
”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్!”
21.ఉత్తరముద్రలు
ఉత్తర ముద్రలు
1.సురభి
2.జ్ఞాన
3.చక్రం
4.యోని :
5.కూర్మ :
6.పంకజం
7.లింగం
8.నిర్వాణ
22.సూర్యోపస్థానము
ప్రాత : కాల మంత్రం
మిత్రస్య చర్ష ణీ ధృత
శ్శ్రవో దేవస్య సానసిమం సత్యం చిత్రశ్రవస్తమం మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్మిత్రో ధాధార పృధివీముతద్యాం మిత్ర : కృష్టీరనిమిష్తాభి చష్టే సత్యాయహవ్యం ఘృతవద్విధేమ ప్ర సమిత్రమర్త్యో
అస్తు ప్రయస్వా న్యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన న హన్యతే న జీయతే త్వోతో
నైనమగ్ంహో అశ్నోత్యన్తితో న దూరాత్
మాధ్యాహ్నిక మంత్రం
ఆ సత్యేనరజసా వర్తమానో నివేశ యన్నమృతం మర్త్యం చ హిరణ్య యేన సవితా రధేన దేవో యాతి భువనా విపశ్యన్ ఉద్వయం తమ సస్పరి పశ్యంతో జ్యోతిరుత్తమం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ : దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యగ్నే : ఆప్రాద్యావా పృధివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ
తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చ్క్రముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం జ్యోక్చ సూర్యందృశే య ఉదగాన్మహతోర్ణ వాద్విభ్రాజమానస్సరిరస్యమధాధ్స మావృషభోలోహితాక్ష స్సూర్యోవిపశ్చిన్మసాపునాతు
సాయంకాల మంత్రము
ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యాచ మృడయ త్వామవస్యురా చకే తత్వా యామి బ్రహ్మణా వన్దమాన స్తదాశాస్తే యజమానో హవిర్భి: అహేద్డ మానో వరునే హ భోద్యురుగం సమాన ఆయు : ప్రమోషీ
యచ్చిద్ది తే విశోయధా ప్ర దేవవరుణ వ్రతం మినీమసి ద్యవెద్యవి యత్కించేదం వరుణ దైవ్యే జనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీ యత్తవ ధర్మాయు యోపిమ మా న స్తస్మా దేనసో దేవరిరీష: కితవాసో యద్రిరిపుర్న దీవి యద్వా ఘా సత్యరముతయన్న విద్మ సర్వాతా వి ష్యశిధి రేవ దేవాధా తే స్యామ వరుణ ప్రియాస :
23.దిగ్దేవతా నమస్కారము
ఓం నమో ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
ధరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
నమో వాన్తరాయై దిశై యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమ :
24.ఋషి దేవతాది నమస్కారము
నమో గంగా యమున యోర్మధ్యే యే వసంతి తేమే
ప్రసన్నాత్మానశ్చిరం జీవితం వర్ధయంతి నమో గంగా యమున యోర్మునిభ్యశ్చ
నమో నమో గంగా యమునయోర్మునిభ్యశ్చనమ: సంధ్యాయై నమ:సావిత్ర్యై నమ: గాయత్ర్యై నమ:సరస్వత్యై నమ:సర్వాభ్యో దేవతాభ్యో నమ: దేవేభ్యో నమ: ఋషిభ్యో నమ:మునిభ్యో నమ: గురుభ్యో నమ:మాతృభ్యో నమ:పితృభ్యో నమ: కామోకార్షీ నమో నమ : మన్యురకార్ షీ న్నమో నమ : పృధ్వి వ్యాప స్తేజో వాయురాకాశాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ
యాం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ
సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యా అభిరక్షతు
25.దేవతా స్మరణము
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణువే
శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ :
యధా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ :
యధా న్తరం న పశ్యామి తధా మే స్వస్తిరాయుషి
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన :
బ్రహ్మణ్య : పుండరికాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుత :
నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ
జగద్ధితాయ క్రిష్ణాయ గోవిందాయ నమో నమ :
26. గాయత్రి ప్రస్థాన ప్రార్థన
ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యను జ్ఞాతా గచ్చ దేవి యధా సుఖం స్తుతో మయా వరదా వేదమాతా ప్రచోదయంతీ పవనే ద్విజాతా అయు : పృధివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం
27. నారాయణ నమస్కృతి
నమో ౽స్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే !!
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ: !!
28. భూమ్యాకాశాభి వందనం
ఇదం ద్యావాపృధివీ సత్య మస్తు పిత రాత్మ ర్యది హో పబ్రువే వాం
భూతం దేవానాం అవమే అవోభి :
విద్యా మేషం వృజినం జీరదానుం
అకాశాత్ పతితం తోయం యధా గచ్చతి సాగరం
సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్ధనం
వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే
నమోస్త్వనంతాయ సహస్రమూర్థయే సహస్రపాదక్షి శిరోరుబాహువే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ :
29.అభివాదనమ్
(లేచి నిలబడి కుడి చేతితో కుడి చెవిని, ఎడమ చేతితో ఎడమ చెవిని పట్టుకోవలెను, ఈ క్రింది విధముగ తమ ప్రవర, నామాదికములను చెప్పుకొని రెండు చేతులు జోడించి అభివాదనము చేయవలయును.)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య: శుభం భవతు--------------------------ఆర్షేయ ప్రవరాన్విత--------------------సగోత్ర:, అశ్వలాయనసూత్ర:, ఋక్ శాఖాధ్యాయీ---------------శర్మా---------అహంభో ఆభివాదయే ||
ఆచమ్య || పురాణాచమనం కృత్వా తత: స్మృత్యాచమనం కృత్వా
30.సమర్పణము
యస్యస్మ్రుత్యా చ నామోక్త్యా తపస్సంధ్యా క్రియాదిషు |
మాన్యం సంపూర్ణయతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం జనార్ధన |
యత్క్రతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనేన ప్రాత:(మధ్యాహ్నిక-సాయం) సంధ్యావందనేన
భగవాన్ సర్వాత్మక: సర్వం శ్రీ పరమేశ్వరార్పమస్తు ||
ఆబ్రహ్మలోకాదాశేషా దాలోకా లోక పర్వతాత్ !
యే సన్తి బ్రాహ్మణా దేవా: తేభ్యో నిత్యం నమో నమ: !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా౽౽త్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్ సకలం నారాయణేతి సమర్పయామి||
(అనుచు జలమును పళ్ళెములో వదలవలెను.)
© www.sandhyaavandanam.com సంధ్యావందనంపై అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్





























Comments
Post a Comment