ప్రాణాయామం జీవన విధానం
ప్రాణాయామం అనగా నేమి
ప్రాణాయామం అంటే శక్తి సమతుల్యత కొరకు ఒక శ్వాస తీసుకునే టువంటి గతిని లేదా శ్వాసను నియంత్రించే, మార్చే టువంటి ప్రక్రియ.
ప్రాణాయామం ఉపయోగాలు ఏమిటి
మన శరీరంలోని ప్రతి కణం (7 మిలియన్ ) దాదాపుగా ఈ ప్రాణాయామం వల్ల లబ్ధి పొందుతాయి.
ప్రాణము అంటే ఏమిటి అది ఇది శ్వాసకు లేదా గాలి కి తేడా ఏంటి ప్రాణము ఏ విధంగా మనిషి లోకి ప్రవేశిస్తుంది అసలు గాలిలో ప్రాణము ఎలా ఉంటుంది. యోగశాస్త్రంలో ప్రాణాన్ని విడిగా ఎందుకు చెప్తారు.గాలి అనొచ్చు కదా.
మనం మంచినీరు తాగినప్పుడు ఏ విధంగా అయితే గాలి అనేది నీటిలో కూడా ఉంది ఆక్సిజన్ రూపంలో మనిషి లోకి ప్రవహిస్తుంది కానీ రెండు విభిన్నమైనవి, అలానే ప్రాణం కూడా గాలి ద్వారా ప్రవేశిస్తుంది మనిషి శ్వాస తీసుకున్నప్పుడు.
ప్రాణాయామ సాధన తర్వాత మనిషి ఏ విధంగా మారతాడు
శ్వాసల లయ బ్యాలెన్స్ చేయబడతాయి అంటే సుధీర్ఘమైన ఆరోగ్యకరమైన సహజమైన శ్వాసను కలుగుతాయి మనకు తెలియకుండానే జరుగుతాయి. శ్వాస లయ ప్రకారం జరుగుతుందో ఆరోగ్యం కూడా సమకూరుతుంది అలానే మెదడు లేదా మన మైండ్ యొక్క బ్యాలెన్స్ అనేది చేకూరుతుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగుతుంది.
ప్రాణాయామం చేసేటపుడు ఏ విధంగా కూర్చోవాలి
ప్రాణాయామం చేసేటపుడు పద్మాసనంలో కూర్చోవాలి దీనిని ఫుల్ లోటస్ పోస్అని కూడా అంటారు .
ప్రాణాయామం చేసేటప్పుడు మనకు ఉపయోగపడే పాయింట్లు ఏమిటి
ముందుగా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఊపిరితిత్తులు శ్వాస మొత్తాన్ని బయటికి వదలాలి నిదానంగా. తర్వాత కొద్ది సేపు వి శ్రమించాలి. అప్పుడు మనకు కావలసినటువంటి ప్రాణాయామాన్ని ఆరంభించాలి.
భయం ఆందోళనకు గురి కాకూడదు వేగంగా తీసుకోకూడదు శ్వాసని చాలా నిదానంగా భయం లేకుండా తీసుకోవాలి
అంటే పూర్తి ఏకాగ్రతతో శ్వాసను గ్రహిస్తూ చేయాలి చేసేది ఊపిరితిత్తుల ద్వారా అయినా మనం పూర్తిగా అంటే మనకు మన ఏకాగ్రత అంతా శ్వాస మీద పెట్టాలి
ఉచ్చ్వాస అంటే గాలిని లోపలికి తీసుకునేటప్పుడు ముందుగా ఉదర భాగంలో అంటే పొట్ట భాగంలో నింపాలి తర్వాత ఊపిరితిత్తుల వరకు నింపాలి
తద్వారా ఎక్కువ గాలిని లోపలికి పంపే అవకాశం వస్తుంది
ఇందులోని ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం శ్వాస గ్రహిస్తూ ఊపిరితిత్తుల్లోని ప్రతి భాగానికి శ్వాస అనేది నింపేలా గా ప్రయత్నించాలి
ముఖ్యంగా మనం చేసే ఏమిటంటే తప్పు ఏమిటంటే మనం గాలిని బలవంతంగా ఎక్కువగా షార్పుగా తీసుకోవడం దీనివలన మనం ప్రాణశక్తిని గ్రహించలేము కొంచెం తక్కువగానే పీడనంతో పంపాలి మనం తీసుకో కెపాసిటీ కంటే కొంచెం తక్కువగానే తీసుకోవాలి, ఏదైనా ఇబ్బంది నొప్పి వీటిని నివారించవచ్చు
మన ఊపిరితిత్తులను శ్వాస పూర్తిగా నింపి అప్పుడు జరిగే టువంటి ప్రక్రియను మనం దృష్టిని లోపల జరిగే స్పందనలు గ్రహించడమే ప్రాణాయామం లోని ముఖ్యమైన అంశం
చాలా సున్నితంగా శ్వాసను తీసుకోవటం సున్నితంగా వదలటం మైనటువంటి వాటి శబ్దాలను గ్రహించటం అనేది చాలా ముఖ్యం
మొదట్లో గాలిని పూర్తిగా బయటికి వదిలేయకుండా కొంచెం లోపల ఉంచుకోవాలి కొంచెం కొద్దిగా విశ్రమించడానికి సమయం తీసుకోవాలి మొదట్లో ఇది చాలా ముఖ్యం
శ్వాసను బయటకు వదిలి నప్పుడు మన కండరాలు యొక్క కదలిక చాలా ఎక్కువ ఉంటుంది అందువలన పూర్తిగా బయటకు వదలకుండా శ్వాసని మొదట్లో తక్కువ వదిలి తరువాత మెల్లిగా శ్వాస తీసుకోవడం ఉండాలి, అంటే శ్వాసను బయటకు పంపేటప్పుడు కొద్దిగా నిదానంగా పంపడం తీసుకునేటప్పుడు కూడా నిదానంగా తీసుకోవడం మొదటిలో చేయాలి
Comments
Post a Comment